Homeఆంధ్రప్రదేశ్Ontimitta: నేడు ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు దంపతులు

Ontimitta: నేడు ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు దంపతులు

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. బుధవారం నెల్లూరు మరియు కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. పేదల సంక్షేమం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ పర్యటన సాగనుంది. సీఎం పర్యటన దృష్ట్యా నెల్లూరు, కడప జిల్లాల యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: సీఎం పర్యటన తొలుత నెల్లూరు జిల్లాలో ప్రారంభం కానుంది. వింజమూరులో నిర్వహించనున్న కార్యక్రమంలో లబ్ధిదారులకు తన చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. అనంతరం పాతూరులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల వినతులు స్వీకరిస్తారు.

Also read-Weather report: ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం: నెల్లూరు పర్యటన ముగించుకుని సాయంత్రం సీఎం చంద్రబాబు కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకుంటారు. కోదండ రాములవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ వేడుకకు నారా భువనేశ్వరి సైతం హాజరుకానున్నారు. కల్యాణం అనంతరం సీఎం దంపతులు ఈ రాత్రి ఒంటిమిట్టలోనే బస చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News