Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Ashok Gajapathi Raju: అశోక్ గజపతిరాజుకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ అభినందనలు

Ashok Gajapathi Raju: అశోక్ గజపతిరాజుకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ అభినందనలు

CM Chandrababu: గోవా గవర్నర్‌గా నియమితులైన టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజుకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతి రాజుకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇది ఎంతో గర్వకారణమైన క్షణమన్నారు. ఇంతటి గౌరవాన్ని ఆయనకు అందించినందుకు గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రివర్గానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. ఈ గౌరవనీయమైన పదవిలో గజపతిరాజు పదవీకాలం విజయవంతంగా, సంతృప్తికరంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

- Advertisement -

గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతి రాజుకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గోవా రాష్ట్ర గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతి రాజు ఎంపిక అవ్వడం సంతోషకరమన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన గవర్నర్‌గా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలను నిర్వహించి పదవికి వన్నె తీసుకొస్తారని ఆశిస్తున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ఇక ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్ గజపతి రాజుకి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ఈ గౌరవాన్ని అందించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన నిజాయితీ, ప్రజా ప్రయోజనం పట్ల అత్యంత నిబద్ధతతో గవర్నర్ కార్యాలయానికి గొప్ప గౌరవాన్ని తెస్తారని విశ్వసిస్తున్నానని వెల్లడించారు.

కాగా కొత్తగా మూడు రాష్ట్రాలకు గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నియమించిన సంగతి తెలిసిందే. గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్‌ అషిమ్‌కుమార్‌ ఘోష్‌, లడఖ్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్‌ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad