Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్..రెండు రోజుల్లో డిక్లరేషన్: సీఎం చంద్రబాబు

CM Chandrababu: అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్..రెండు రోజుల్లో డిక్లరేషన్: సీఎం చంద్రబాబు

AP Green Hydrogen Hub: హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ పై పరిశోధనలు చేసి, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దానికి తగిన సదుపాయాలను కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి వేదికగా శుక్రవారం నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో సీఎం ఈ విధంగా ప్రసంగించారు. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తామని సీఎం హామీ ఇచ్చారు. రెండు రోజుల తర్వాత దీనిపై డిక్లరేషన్ ప్రకటిస్తామని, ఏడాది తర్వాత దాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

- Advertisement -

గ్రీన్ హైడ్రోజన్‌ను తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసేలా సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీని కోసం అనేక యూనివర్సిటీలు, పరిశోధకులు కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

గ్రీన్ హైడ్రోజన్… గేమ్ ఛేంజర్

ఇంధన రంగంలో ప్రస్తుతం మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాం. వాటిని అధిగమించేలా పరిశోధనలు చేసి పరిష్కారాలను కనుగొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వాడుకలో ఉన్న ఇంధనాల కారణంగా తీవ్రమైన కాలుష్యం బారిన పడుతున్నామని జీరో కార్బన్ లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ వంటి ఇంధనమే అందుకు సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad