Thursday, July 17, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం ఉండదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం ఉండదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu Comments: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీలు వాదించాయి. ఈ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఆల్ పార్టీ ఎంపీలతో సమావేశం కూడా నిర్వహించారు. కేంద్ర జలశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం కేంద్ర నిపుణుల కమిటీ బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది.

- Advertisement -

తాజాగా ఈ అంశంపై మరోసారి సీఎం చంద్రబాబు స్పందించారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం లేదని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సముద్రంలోకి వృథాగా పోయే నీళ్లను వాడుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయని తెలిపారు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులపై తాను ఎప్పుడు వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. బనకచర్లపై కొంత మంది ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఉమ్మడి ఏపీలో దేవాదుల ప్రాజెక్టుకు తానే పునాదులు వేశానని తెలిపారు. గోదావరి నీళ్లు ఏడాదిలో సగటున 2000 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతున్నాయని పేర్కొన్నారు. వృథాగా పోయే నీటిలో 200 టీఎంసీలు వాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని ఆయన వెలల్లడించారు.

ఇక ఇటీవల మాజీ సీఎం జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య మృతి అంశంపై మరోసారి స్పందితంచారు. కారు కింద కార్యకర్త పడినా కూడా కనీసం మానవత్వం చూపించలేదని విమర్శించారు. ఇప్పుడేమో సింగయ్య కుటుంబసభ్యులను బెదిరించారని ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన నేతలు రాజకీయాల్లో ఉన్నారని మండపడ్డారు. తప్పుడు ప్రచారాలు తాత్కాలికమని చేసిన పనులు శాశ్వతం అన్నారు.తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకం డబ్బులు ఇచ్చామని తెలిపారు. అనర్హులకు పెన్షన్ తీసేస్తే కూడా రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మించడమే తన ఆకాంక్షఅని వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News