HomeTop StoriesCM Chandrababu: పార్టీ కార్యకర్తే అధినేత.. మహానాడుపై సమీక్షలో సీఎం కీలక సూచనలు

CM Chandrababu: పార్టీ కార్యకర్తే అధినేత.. మహానాడుపై సమీక్షలో సీఎం కీలక సూచనలు

CM Chandrababu Comments on Politburo Meeting: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా ఆన్‌లైన్‌ జూమ్‌ మీటింగ్‌లో జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మహానాడులో చర్చించాల్సిన పలు అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘‘కార్యకర్తే అధినేత అనేది మహానాడులో ప్రతిబింబించాలి. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలి. పార్టీ అనాధిగా వస్తున్ఉన సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాష్ట్ర జనాభాలో 50 శాతంగా ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. వారి అభివృద్ధికి పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందనే సందేశాన్ని స్పష్టంగా కార్యకర్తలు, నాయకుల్లోకి తీసుకెళ్లాలి. హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలి. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభిద్దాం. ప్రతి వక్తా తమకు కేటాయించిన అంశంపై సూటిగా, స్పష్టతగా మాట్లాడాలి.’’ అని సీఎం సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబుతో పాటు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాల్గొన్నారు. కాగా, మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది.

- Advertisement -

Also read: Medak Fire Accident: కంటైనర్‌ లారీలో భారీగా ఎగిసిపడ్డ మంటలు.. అందులోని ఎనిమిది కార్లు దగ్ధం..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News