HomeTop StoriesCM Chandrababu: ఈసారి ఆన్‌లైన్‌లోనే పసుపు పండుగ.. మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం..!

CM Chandrababu: ఈసారి ఆన్‌లైన్‌లోనే పసుపు పండుగ.. మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం..!

CM Chandrababu decision on Mahanadu: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈ ఏడాది కేవలం ఆన్‌లైన్‌లోనే జరపాలని నిర్ణయించారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్జీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రతిఏటా మే 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహిస్తూ వస్తోంది. టీడీపీ క్యాడర్‌ పసుపు పండుగగా జరుపుకునే మహానాడును ఈ సారి నెల్లూరులో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే, ప్రధాని మోదీ పశ్చిమాసియా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంధన పొదుపుపై జాతికి దిశానిర్దేశం చేయడంతో ఈసారి ఆన్‌లైన్‌లోనే మహానాడు నిర్వహించాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also Read: CM Revanth: పారిపోవడం తప్పు.. కుమారుడిని అప్పగిస్తేనే మంచిది.. బండి సంజయ్‌కి సీఎం సూచన 

1,845 క్లస్టర్లలో ఎలక్ట్రానిక్ స్క్రీన్ల ఏర్పాటు..

కాగా, ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు పొదుపు చర్యలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కాన్వాయ్‌లో కార్లను కూడా తగ్గించుకున్నారు. ఇప్పుడు ఇందులో భాగంగానే మహానాడును ఆన్ లైన్‌ హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు ఈ ఏడాది ఆన్‌లైన్‌లోనే మహానాడును ఈ నెల 27, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లోనే ఒక వేదిక నిర్మించి దానిపై పొలిట్ బ్యూరో సభ్యులు ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడే తీర్మాణాలు చేసి ఆమోదించనున్నారు. ఈ హైబ్రిడ్ మహానాడు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో ఎలక్ట్రానిక్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News