CM Chandrababu Delhi Tour: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు ఆయన దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం.. ఉదయం 11.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తోనూ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించమన్నారు. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు సీఎంతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతిఆయోగ్ సభ్యులతో సమావేశమవుతారు. ఇక, రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు సీఎం.. మంగళవారం కూడా కొన్ని కీలక సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read: https://teluguprabha.net/telangana/vh-hunger-strike-enters-second-day/

