సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు(Chandrababu) కుటుంబం స్వగ్రామం నారావారి పల్లెలో ఉన్న సంగతి తెలిసిందే. బంధువుల మధ్య పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. భోగి రోజు మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల నిర్వహించి సందడిగా జరుపుకున్నారు. పిల్లల పోటీల్లో చంద్రబాబు మనవడు, లోకేశ్(Nara Lokesh) కుమారుడు నారా దేవాన్ష్ పాల్గొని సరదాగా గడిపాడు. అనంతరం విజేతలకు చంద్రబాబు దంపతులు బహుమతులు అందజేశారు.
ఇక సంక్రాంతి పండుగ రోజున గంగమ్మకు పూజలు చేశారు. నాగాలమ్మ పుట్ట వద్ద పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.