Wednesday, January 8, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: తెలంగాణ ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Chandrababu: తెలంగాణ ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు(Chandrababu)తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సీఎంతో చర్చించారు. తిరుమల(Tirumala)లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను వారానికి నాలుగు సార్లు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు బీఆర్‌ నాయుడు తెలిపారు. ఇక వారానికి రెండు బ్రేక్‌ దర్శనాలు, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన లేఖలు అంగీకారం తెలిపారని చెప్పారు.

- Advertisement -

కాగా తిరుమల శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని తెలంగాణ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ వారు మండిపడుతున్నారు. గతంలోలా తెలంగాణ భక్తులు, ప్రజాప్రతినిధులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనంలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై టీజీ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News