Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: జగన్ భూతాన్ని మళ్లీ రానివ్వను.. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్

CM Chandrababu: జగన్ భూతాన్ని మళ్లీ రానివ్వను.. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్

CM Chandrababu Hot Comments on Jagan: గత వైసీపీ ప్రభుత్వం పాలనపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడలో నిర్వహించిన భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య (FICCI) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ అనే భూతం మళ్లీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత తనదంటూ పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనను మర్చిపోండని సూచించారు.

గతంతో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక కంపెనీలను గత ప్రభుత్వం తరిమేసిందని ఆరోపించారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని కొందరు పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారని తెలిపారు. వారు భయపడాల్సిన పని లేదని.. వైసీపీ భూతం అధికారంలోకి రాకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వం కంటిన్యూ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

ఇక భవిష్యత్తులో అమరావతిలో అద్భుతమైన అవకాశాలు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. పరిశ్రమలకు చెందిన అన్ని అనుమతులను మంజూరు చేసినట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో..అలాగే కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లవద్దని తనకు సూచించేవారని.. అయితే తాను మాత్రం దావోస్‌కు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర సాకారం అయ్యేందుకు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఫిక్కీ జాతీయ కార్యవర్గం స్పష్టం చేసింది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad