Sunday, January 12, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: సంక్రాంతికి స్వగ్రామంలో సీఎం చంద్రబాబు

CM Chandrababu: సంక్రాంతికి స్వగ్రామంలో సీఎం చంద్రబాబు

ప్రతి ఏటా సంక్రాంతి పండుగను సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్వగ్రామం నారావారి పల్లెలో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అదే ఆనవాయితీని కొనసాగించనున్నారు. ఈమేరకు ఆయన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి చేరుకోనున్నారు. అనంతరం తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని ప్రారంభించనున్నారు.

- Advertisement -

రాత్రికి స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకోనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, బ్యూటిఫికేషన్, సబ్ స్టేషన్, రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులు నారావారి పల్లె చేరుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News