Tuesday, January 21, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: దావోస్‌లో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. పారిశ్రామికవేత్తలతో వ‌రుస భేటీలు

Chandrababu: దావోస్‌లో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. పారిశ్రామికవేత్తలతో వ‌రుస భేటీలు

ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్(Davos)వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పెట్టుబడుల అన్వేషణలో నిమగ్నమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేష్(Lokesh) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని, సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని మిట్టల్‌ను కోరారు.

- Advertisement -

హెచ్‌పీసీఎల్‌-మిట్టల్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ HMEL-HPCL మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3,500 కోట్లతో భారతదేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఇక రెండో రోజు సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈఓ షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈఓ జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్, సీఈఓ కాత్ మెక్‌లే, సిస్కో సీఈఓ చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై ఆయన చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News