HomeTop StoriesCM Chandrababu: రోడ్డు పక్కన కాన్వాయ్‌ ఆపి తాటి ముంజలు తిన్న సీఎం దంపతులు.. ఫోటోలు...

CM Chandrababu: రోడ్డు పక్కన కాన్వాయ్‌ ఆపి తాటి ముంజలు తిన్న సీఎం దంపతులు.. ఫోటోలు వైరల్‌

CM Chandrababu Kuppam Visit: చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు మార్గంమధ్యలో రోడ్డుపక్కన ఆగి తాటిముంజలు తిన్నారు. సీఎం దంపతులు కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మార్గమధ్యంలో తంజమ్మకొట్టాలు వద్ద కల్లు గీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని గమనించి తన కాన్వాయ్‌ను ఆపారు. అనంతరం, తాటి ముంజలు తిని కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు, భువనేశ్వరి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

- Advertisement -

Also Read: Bhatti Vikramarka: విద్యా రంగంలో పెట్టుబడులకు ఆర్థిక సాయం చేయండి.. కేంద్ర మంత్రిని కోరిన భట్టి..!

మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయ్‌..

‘‘కల్తీ లేదు.. కార్బైడ్‌ లేదు. పురుగు మందుల గోల లేదు. మా కుప్పం ప్రజల్లాగే స్వచ్ఛమైన మనసుల్లాంటి చల్లనైన తాటి ముంజలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో ఆనందంగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులకు మించింది ఏముంటుంది!’’ అని చంద్రబాబు తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. ‘‘తాజా తాటి ముంజలను రుచి చూశాం. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయ్‌. కల్లుగీత కార్మికులతో కాసేపు మాట్లాడి వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు’’ అని భువనేశ్వరి పోస్ట్‌ చేశారు. సీఎం దంపతులు తాటి ముంజలు తిన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News