రాజధాని అమరావతిలోని వెలగపూడిలో ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణీ, మనవడు దేవాంశ్ పాల్గొన్నారు. ఇంటిని 1,455 చ.గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1లో నిర్మించనున్నారు.
- Advertisement -
కాగా గత ఏడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.



