Saturday, April 26, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: మత్స్యకార భరోసా పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

CM Chandrababu: మత్స్యకార భరోసా పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

మత్స్యకారుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) శుభవార్త చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 14వ తేదీ వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి రూ.20వేలు ఇవ్వనున్నారు. ఈమేరకు మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో మత్స్యకారులతో భేటీ అయి వారి జీవన విధానాన్ని పరిశీలించారు.

- Advertisement -

మత్య్సకార కుటుంబం మద్దు పోలేష్, రామలక్ష్మీతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కారి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్యతో ముచ్చటించి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మత్స్యకార శాఖ ఏర్పాటు చేసిన వివిధ మత్స్యకార స్టాల్స్ సందర్శించిన సీఎం చంద్రబాబు.. మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న పరికరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల ఆదాయం పెంచడానికి, పేదరిక నిర్మూలనకు కృషిచేస్తూ వినూత్న కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 69,000 మంది మత్స్యకారులకు ఫించన్లు ఇచ్చామని.. లీటర్ డీజిల్‌కి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మత్స్యకార జీవితాలలో వెలుగుకు ఒక ప్రణాళిక నిర్మిస్తామన్నారు. షిప్పింగ్ హార్బర్స్ నిర్మించి మత్స్యకారుల జీవితాలలో మార్పు తీసుకువస్తామని పేర్కొన్నారు. సముద్రతీరం, నదులు, బంగారం పండే భూమి ఉన్న శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News