CM Chandrababu| ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఇవాళ ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు.
- Advertisement -
ఓ మహిళా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి ఉచిత సిలిండర్ అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం వంటగదిలోకి వెళ్లి స్వయంగా స్టవ్ వెలిగించి టీ(Tea) తయారుచేసి తాగారు. దీంతో ఆ కుటుంబసభ్యులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.