ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) మనవడి పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబసభ్యులు తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానసత్రంలో భక్తులకు భోజనం వడ్డించారు. తదుపరి కుటుంబసభ్యులతో కలిసి సత్రంలోనే భోజనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తిరుపతిలో ముంతాజ్ హోటల్, దేవలోక స్థల కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా TTD ఆస్తులను ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.


అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లో వెంకటేశ్వర ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు. ఇక తిరుమలలో హిందువులే పనిచేయాలని మరోసారి స్పష్టం చేశారు. 2003లో అలిపిరి వద్ద జరిగిన బ్లాస్టింగ్ ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి మహిమ వల్లే తాను ఆ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ(TTD) పాలకమండలి సభ్యులు పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.