ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే విహాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. ఇక బుధవారం మధ్యాహ్నం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్(Bill Gates)తో సమావేశం అవుతారు. గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయ సంస్కరణలు, ఏఐ టెక్నాలజీ వంటి అంశాలపై ఆయనతో చర్చిస్తారు. ఈమేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి అమరావతి చేరుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.
Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. బిల్ గేట్స్‌తో భేటీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES