మహిళ దినోత్సవం నాడు తన సతీమణి నారా భువనేశ్వరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu) పట్టు చీర కొన్నారు. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం చంద్రబాబు సందర్శించారు.
- Advertisement -
ఇందులో భాగంగా మహిళలు ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ స్టాల్స్ ను సందర్శించి అనంతరం అందులోని ఒక చీర సీఎం సతీమణి నారా భువనేశ్వరికి బాగుంటుందని చెప్పగా సీఎం ఆ చీరను రూ.25వేలు పెట్టి కొన్నారు.
అంతేకాకుండా సీఎం పర్యటన సందర్భంగా ఒక్క సెల్పీ అని స్టాల్స్ లోని మహిళలు అడగ్గా చంద్రబాబు అందుకు అంగీకరించి వారితో సరదాగా ఫోటో కూడా దిగారు. అందరికి ఆయన మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.