Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: మొయినాబాద్‌ డ్రగ్స్‌ వ్యవహారం.. ఎంపీపై సీఎం చంద్రబాబు ఫైర్‌

CM Chandrababu: మొయినాబాద్‌ డ్రగ్స్‌ వ్యవహారం.. ఎంపీపై సీఎం చంద్రబాబు ఫైర్‌

Moinabad Drugs Case: మొయినాబాద్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రజాప్రతినిధి ఉండటంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సదరు నేతను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. ఘటనపై సమగ్ర నివేదికను ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని ఆదేశించారు.

- Advertisement -

హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడటంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎంపీ నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎంపీ పుట్టా మహేష్‌కు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: https://teluguprabha.net/telangana/eagle-team-key-details-on-moinabad-drugs-case/

ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని పార్టీ నాయకత్వాన్ని చంద్రబాబు ఆదేశించారు. డ్రగ్స్ వంటి విషయాల్లో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని, వ్యక్తుల బలహీనతల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదని చంద్రబాబు ఉద్ఘాటించారు.

మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌లో శనివారం రాత్రి ఈగల్‌ టీం నిర్వహించిన దాడుల్లో ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఓ మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారని ఈగల్‌ టీం తెలిపింది. ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.

Also Read: https://teluguprabha.net/telangana/rythu-bharosa-funds-2026-rabi-season-release-on-march-22nd/

మరోవైపు ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పట్టుబడటం సిగ్గుచేటని విమర్శలు చేశారు. అతడిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని, టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె చేశారు.

ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ఇక్కడ ఎంపీ కొకైన్‌తో విందు, చిందులు చేయడం దారుణమని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఎంపీ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని, యువతను డ్రగ్స్ వాడమని ప్రోత్సహిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News