HomeTop StoriesAP Cabinet: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్‌.. సమాచారం లీక్‌ అవ్వడంపై ఆగ్రహం

AP Cabinet: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్‌.. సమాచారం లీక్‌ అవ్వడంపై ఆగ్రహం

AP Cabinet CM Chandrababu: ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. అమరావతి రాజధానికి చట్టబద్ధతపై ప్రధాని మోదీతో పాటు కేంద్రానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కాగా, భేటీలో మంత్రులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబీనెట్‌ అజెండాతో సహా ప్రభుత్వంలోని కీలక సమాచారం ఎలా లీక్‌ అవుతుందని ప్రశ్నించారు. ఇకపై ఏ సమాచారం లీకైనా మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/good-news-for-telangana-rtc-employees-da-hiked-by-2-1-percent/

రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశానికి ముందే అజెండా అంశాలు బయటకు లీక్ అవ్వడంపై ఆయన మంత్రులకు “క్లాస్” తీసుకున్నారు. కేబినెట్ అజెండా సమాచారం బయటకు ఎలా పొక్కుతోందని ఆయన ప్రశ్నించారు. గతంలో సమాచారం లీక్ అయినందుకు దివంగత నేత ఎన్టీఆర్‌ తన కేబినెట్‌ను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భవిష్యత్తులో ఇలాగే జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, అజెండా కాపీలు ముందుగా అందకపోవడం వల్ల సన్నద్ధత లోపిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించగా, అధికారుల పనితీరుపై కూడా సీఎం అసహనం వ్యక్తం చేశారు. 

మంత్రులు తమ పనితీరును మరింత వేగంగా మెరుగుపరుచుకోవాలి.’జలధార’, ‘సూర్య ఘర్’, ‘పీఎం కుసుమ్’ వంటి కీలక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు చురుగ్గా వ్యవహరించాలి. పట్టాదార్ పాస్‌బుక్‌ల పంపిణీ వంటి వ్యవహారాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి. రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు మంత్రులు సిద్ధంగా ఉండాలి. – అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/hiv-injection-for-refusing-marriage-woman-commits-suicide/

మరోవైపు కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. 16వ SIPBలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం లభించింది. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్వాంటమ్‌ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News