Friday, May 23, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా కేంద్ర ఇందనశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోలార్‌ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్‌ పథకం అమలుపై జోషితో చర్చించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంమలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో చర్చలు ఫలవంతంగా సాగాయని చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పారు. అలాగే మరికొందరు కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News