HomeTop StoriesAGRIGOLD: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం దిశగా సీఎం ఆదేశాలు.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు

AGRIGOLD: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం దిశగా సీఎం ఆదేశాలు.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు

AGRIGOLD Victims: అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లోగా న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రి గోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అగ్రి గోల్డ్‌ మోసం వల్ల 8 రాష్ట్రాల్లో 20 లక్షల మంది బాధితులు ఉండగా.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 11.5 లక్షలకు పైగా బాధితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-cabinet-approves-investments-worth-rs-2-lakh-crore/

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ ఉన్నతాధికారులు సైతం అగ్రిగోల్డ్ సొమ్మును స్వాహా చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాబోయే 6 నెలల కాలపరిమితిలోనే బాధితులందరికీ పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/newlywed-dies-after-car-hits-guardrail-at-shaniwada-junction/

కాగా, గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED).. అగ్రిగోల్డ్‌కు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టుల ద్వారా క్లియరెన్స్ పొంది, అటాచ్ చేసిన ఆస్తులను వేగంగా వేలం వేయడం ద్వారా బాధితులకు సొమ్మును తిరిగి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. అగ్రిగోల్డ్ లేఅవుట్లలో ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులకు కూడా ప్రభుత్వం ఊరట కలిగించేలా గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న బాధితులకు, ఏజెంట్లకు ఈ నిర్ణయంతో త్వరలోనే పూర్తి న్యాయం చేకూరనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News