Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

Chandrababu: స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు (Chandrababu) పర్యటిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్డీఆర్‌ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. స్వయంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందించారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం తరఫున అందజేయాల్సిన సాయంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇతర నాయకులు, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. కాగా ప్రతి నెల రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో పింఛన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చంద్రబాబు స్వయంగా పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News