Monday, March 9, 2026
HomeTop StoriesCM Chandrababu: ‘జస్టిస్ సిటీలో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తాం’

CM Chandrababu: ‘జస్టిస్ సిటీలో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తాం’

CM Chandrababu: అమరావతిలో నిర్మిస్తున్న ‘జస్టిస్ సిటీ’లో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. న్యాయ వ్యవస్థకు అవసరమైన భూములు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అమరావతిని బ్లూ గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో సీఎం పాల్గొన్నారు.

- Advertisement -

అమరావతిలో ‘మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు’లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. అమరావతిలో నిర్మిస్తున్న జస్టిస్ సిటీని దేశంలోనే అత్యుత్తమ మోడల్‌గా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. 

cm justice amaravati

‘రాజధాని నిర్మాణంలో భాగంగా జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. ముఖ్యంగా జ్యుడీషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి కీలక విభాగాలన్నింటినీ ఒకే చోట ఇంటిగ్రేట్ చేస్తూ బెస్ట్ జుడిషయల్ సిటీని నిర్మిస్తాం. ఈ బృహత్తర కార్యానికి సీజేఐ సహకారం కావాలి. అమరావతిలో ‘నేషనల్ జుడిషియల్ అకాడమీ’ ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన భూములు ఇవ్వడానికి, పూర్తి సహకారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’ – అని చంద్రబాబు నాయుడు అన్నారు. 

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/drunk-and-drive-tests-weekend-special-in-hyderabad-cyberabad-limits/

‘గ్రామీణ ప్రాంతాల్లో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే సంప్రదాయం ఉంది. నా తండ్రి కూడా గ్రామంలో పెద్దరికం వహించి, మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించారు. కోర్టుల్లో కేసుల భారాన్ని తగ్గించేందుకు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే రూ. 10 వేలు, ఒకవేళ కేసులు పరిష్కారం కాకపోయినా రూ. 3 వేలు ప్రోత్సాహకంగా ఇస్తాం. సత్వర న్యాయం అందడం వల్ల అభివృద్ధి కూడా వేగవంతం అవుతుంది.’ అని సీఎం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. వికసిత్ భారత్- 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.

మధ్యవర్తిత్వం అనేది భారతీయుల రక్తంలోనే ఉందని, ఇది మన పురాణాల కాలం నుంచే అమలులో ఉందని సీజేఐ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు.. కురుపాండవుల యుద్ధాన్ని ఆపేందుకు చేసిన రాయబారమే దీనికి నిదర్శనమని వెల్లడించారు. ఒకప్పుడు కేవలం నగరాలు, మేధావుల చర్చలకే పరిమితమైన మధ్యవర్తిత్వం, ఇప్పుడు గ్రామాలకు, వీధులకు, సామాన్యుల ఇళ్ల వరకూ చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు.

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-suggestions-to-telugu-people-in-gulf-countries-and-iran/

‘న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం అనేది ప్రత్యామ్నాయం కాదు., అది ఒక ప్రాధాన్యత కలిగిన అంశం. దీనివల్ల కోర్టుల్లో కేసుల భారం తగ్గి, త్వరితగతిన పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయి. వీటిని మధ్యవర్తిత్వం ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చు. అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, ప్రభుత్వం చూపిన చొరవ కూడా మధ్యవర్తిత్వానికి ఒక విజయం.’ – అని సీజేఐ వెల్లడించారు. 

ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందుగా అమరావతిలో నూతనంగా నిర్మించనున్న ఏపీ హైకోర్టు అతిథి గృహానికి శంకుస్థాపన, అలాగే హైకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్మించిన నివాస సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News