CM Chandrababu| తెలంగాణలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం(Potti Sriramulu Telugu University) పేరు మార్పుపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి (Suravaram Prathapa Reddy) పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2024/12/28HY_TELANGANA_POLICE_HEADQUARTERS-1024x563.jpg)
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టిన పొట్టి శ్రీరాములు పేరును మార్చే పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీని కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2024/12/telugu-university-1693466764.jpg)