ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు నాలుగు రోజుల దావోస్ పర్యటన తర్వాత ఢిల్లీకి చంద్రబాబు చేరుకున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు.
కాగా దావోస్ పర్యటన సందర్భంగా ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం పాల్గొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన పరిస్థితులను వారికి వివరించారు.