Sunday, December 8, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: చిన్నారి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. నిందితుడిపై కఠిన చర్యలు...

CM Chandrababu: చిన్నారి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

CM Chandrababu| తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే ఆ కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థికసాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

- Advertisement -

మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత(Anitha) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.

కాగా ఈ కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మూడున్నర సంవత్సరాల చిన్నారిని చంపింది మావయ్యనేనని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ‌‌ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్లు కొని ఇస్తానని బయటకు తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశాడని చెప్పారు. చిన్నారి హత్యపై అన్ని ఆధారాలు సేకరించామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు నిందితుడు పేరు నాగరాజు అలియాస్ సుశాంత్ అని వెల్లడించారు. అటు అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు..కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News