2024లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు రూ. 1554.99 కోట్ల అదనపు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.608.08 కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు(Chandrababu) స్పందించారు.
- Advertisement -
రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి విపత్తు బాధిత రాష్ట్రాలకు ప్రకటించిన రూ.1554.99 కోట్లలో ఏపీకి రూ.608.08 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేంద్ర హై లెవల్ కమిటీ ప్రకటనను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.