HomeTop StoriesCM Chandrababu: బెంగాల్‌లో రేపు నూతన ప్రభుత్వ ఏర్పాటు.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: బెంగాల్‌లో రేపు నూతన ప్రభుత్వ ఏర్పాటు.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Naidu to Bengal: మే9న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే కూటమిలోని ఇతర ముఖ్య నేతలు సహా.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కోల్‌కతాలోని ప్రసిద్ధ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక జరగనుంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/interest-free-loan-limit-for-dwcra-increased-from-rs-5-lakh-to-rs-10-lakh/

షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి.. హెలికాప్టర్ ద్వారా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 7:40 గంటలకు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు బయలుదేరి.. ఉదయం 9:20 గంటలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదికకు బయలుదేరుతారు.

Also Read: https://teluguprabha.net/telangana/pcc-chief-lashes-out-at-tamil-nadu-politics/

ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వానికి, నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి తిరిగి బయలుదేరి హైదరాబాద్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News