విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం అని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ మహాసభలు జరిగే ప్రాంగణానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టడం ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తోంది. అలాగే ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు గారి పేరు పెట్టడం కూడా అభినందనీయం. ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులకు, పాల్గొంటున్న తెలుగుభాషాభిమానులకు అందరికీ ధన్యవాదాలు. ఈ మహా సభలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ…. నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.