HomeTop StoriesCM Chandrababu: విధ్వంస పాలనకు పాతరేసి నేటికి రెండేళ్లు.. ఏపీ ప్రజలకు ధన్యవాదాలు.. సీఎం చంద్రబాబు...

CM Chandrababu: విధ్వంస పాలనకు పాతరేసి నేటికి రెండేళ్లు.. ఏపీ ప్రజలకు ధన్యవాదాలు.. సీఎం చంద్రబాబు ట్వీట్‌

CM Chandrababu tweet goes viral: నేడు (జూన్ 4)వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించిన ప్రజలు.. తమ ఓటు అనే ఆయుధంతో అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక రోజు అని అభిప్రాయపడ్డారు. జగన్‌ అరాచక పాలన ముగిసి నేటితో రెండేళ్లని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘‘ఈ అద్భుతమైన విజయం మాకు అధికారం కాదు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నాం. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గం సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్నాం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని సుభీక్షం చేయాలన్నదే మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తున్నాం. మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్’’ అని సీఎం ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Also read: BJP vs Rahul : రాహుల్ పై భాజపా ధ్వజం: ‘హస్తం’ గూటిలోనే అసలైన ఎమర్జెన్సీ!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News