సీఎం చంద్రబాబు(CM Chandrababu) రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అలాగే నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించే సమీక్షకు హాజరుకానున్నారు.
సీఎం షెడ్యూల్ ఇదే..
** గురువారం ఉదయం 10గంటలకు ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ
** ఉదయం 11 గంటలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం
** మధ్యాహ్నం 12గంటలకు జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ
** మధ్యాహ్నం 1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో సమావేశం
** సాయంత్రం 3గంటలకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ
** సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్షకు హాజరు
** రాత్రి 9గంటలకు కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో భేటీ
** ఈనెల 24న భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరు