ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు నారావారి పల్లెలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను చంద్రబాబు దంపతులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నారా లోకేశ్, బ్రాహ్మణి, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
- Advertisement -
ఆ తర్వాత తల్లిదండ్రుల సమాధులను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తమ కుల దైవం నాగాలమ్మ తల్లి పుట్ట వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేశారు.