Monday, December 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: తొక్కిసలాట ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: తొక్కిసలాట ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

తిరుపతిలో తొక్కిసలాట(Tirupati Stampede) జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు(Chandrababu) పరిశీలించారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ఆయన అక్కడి నుంచి నేరుగా తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. కాగా మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్‌, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు సీఎం వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News