తిరుపతిలో తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు స్విమ్స్(SVIMS) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను సీఎం చంద్రబాబు(Chandrababu) పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. సీఎం వెంట మంత్రులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు, ఇతర అధికారులు ఉన్నారు.
అంతకుముందు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఘటనకు గల కారణాలు, బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అధికారలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు.