Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: అసభ్యకర పోస్టులు పెట్టే వారికి సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: అసభ్యకర పోస్టులు పెట్టే వారికి సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chadnrababu| సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అమరావతిలోని తాళ్లాయిపాలెంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. అధికారం పోయాక వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.

- Advertisement -

పవన్‌ కల్యాణ్‌ బిడ్డలపైనా ఇష్టారీతిన పోస్టులు పెట్టారని.. అలాంటి వారిని వదిలిపెట్టాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ప్రజాస్వామ్యం ముసుగులో మద్దతిస్తారా..? అంటూ ప్రతిపక్ష నేతలను నిలదీశారు. తాను బాంబులకు కూడా భయపడలేదని.. కానీ తన భార్య గురించి అసెంబ్లీలో దుర్మార్గంగా మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తుచేసుకున్నారు. కొవ్వు ఎక్కువై బరితెగిస్తున్న వారి ఆటలు కట్టిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆడబిడ్డలను దారుణంగా అవమానించే వైసీపీ లాంటి పార్టీ రాష్ట్రానికి అవసరమా అన్నారు.

జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని సాక్షిలో ప్రసారం చేశారని.. అందరితో పాటు తాను కూడా నమ్మానన్నారు. కానీ ఆ తర్వాత అది భయంకరమైన హత్య అని తేలిందన్నారు. హద్దులు దాటితే ఉపేక్షించేది లేదని.. చేతగానితనం అనుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేయడమా? అసభ్య, అశ్లీల పోస్టులు పెట్టడమా? ఇలాంటి నేరస్థులను కట్టడి చేసేందుకు పోలీసులను సమర్థంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad