ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పిలుపునిచ్చారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ పీ4 విధాన పత్రాన్ని విడుదల చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలి. మనం, మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండడమే పండుగ. ఆర్థిక అసమానతలు తొలగిపోయి, సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇందులో భాగంగా ప్రతిపాదించిన P4 (పబ్లిక్ -ప్రైవేటు- పీపుల్-పార్టనర్షిప్) విధానంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిస్తున్నాను. ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుందాం.” అని తెలిపారు.