Chandrababu| ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పథకాల అమలుకు ప్రజలే నిర్ణయం తీసుకునేలా కొత్త విధానం తీసుకొచ్చింది. ఈమేరకు సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వస్తుంది. అయితే పథకాల అమల్లో ఎక్కడా చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వ పనితీరును ప్రజల నుంచి తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే పథకాలు, పౌర సేవలపై ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించింది. మెరుగైన సేవల కోసం లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఇందుకోసం ఐవీఆర్ఎస్(IVRS) విధానాన్ని ఉపయోగించాలని ఆదేశించారు.
మరోవైపు ఈనెల 3వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరపాలని నిర్ణయించారు. ముందుగా 4వ తేదీ మంత్రివర్గం సమావేశం పెట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఓరోజు ముందుగానే జరుపుతున్నారు. ఈమేరకు ఆదివారం సాయంత్రంలోపు కేబినెట్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సర్క్యూలర్ జారీ చేశారు.