Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్CM helping hand: యువకుడికి సర్కారీ సాయం

CM helping hand: యువకుడికి సర్కారీ సాయం

రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నరసరావు పేటకు చెందిన ఎం.ప్రేమ్ హర్ష వర్ధన్ అనే యువకుడు గత కొంత కాలంగా (హార్ట్ ఎటాక్) గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ గత నెల 26న అనంతపురంలో జరిగిన జగనన్న వసతి దీవెన సభకు వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి ని కలిసి తాను పడుతున్న ఇబ్బందులను సీ.ఎం.కు వివరించి ఆదుకోవాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ భాదితుడ్ని ఆదుకోవాలని, వైద్య సేవలు అందేలా చూడాలని ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా వివరాలను పంపాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి స్పందించి తక్షణ సాయంగా రూ.1 లక్ష చెక్కును బాధితుడు హర్ష వర్ధన్ కు అంద జేశారు. హర్ష వర్ధన్ (హెర్ట్)గుండె లో పేస్ మేకర్ అమర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అవసర మైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం మీడియా సెంటర్ వద్ద చెక్కును అందజేశారు. చెక్కును అందుకున్న బాధితుడు హర్ష వర్ధన్ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, జిల్లా ఆరోగ్య శ్రీ అధికారిణి డాక్టర్. సునీల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News