శోకసంద్రంలో ఉన్న మంత్రి ఫరూక్ (Minister Farooq)ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య పరామర్శించారు.
విధి కొన్ని క్షణాల్లోనే జీవితాన్ని మార్చేస్తుంది. మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి NMD ఫరూక్ సతీమణి షెహనాజ్ అనారోగ్యంతో హఠాత్తుగా మృతి చెందడం, ఆయనను శోకసంద్రంలో ముంచేసింది. జీవిత భాగస్వామిని కోల్పోవడం అంటే, గుండె చెరువైనంత బాధ. ఫరూక్ కుటుంబ సభ్యుల దుఃఖాన్ని వర్ణించేందుకు మాటలు కూడా చాలవు.

ఈ విషాద సమయంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఫరూక్ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. వారి దుఃఖంలో పాల్గొని సానుభూతి వ్యక్తం చేశారు.
“ఈ కష్ట సమయంలో మీ వెంటే మేమున్నాం” అంటూ భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి , టీడీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ లు, నేతలు ఫరూక్ కుటుంబానికి మద్దతుగా నిలబడ్డారు.