HomeTop StoriesKrishnalanka incident: కృష్ణలంక లాకప్‌ డెత్‌పై సీఎం సీరియస్‌.. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం

Krishnalanka incident: కృష్ణలంక లాకప్‌ డెత్‌పై సీఎం సీరియస్‌.. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం

CM takes serious view of Krishnalanka incident: విజయవాడలోని కృష్ణలంక లాకప్‌ డెత్‌ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీ హరీశ్‌ గుప్తాను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గాదె సాయికృష్ణ అనే యువకుడిని లాకప్‌లోనే కొట్టి చంపారంటూ కృష్ణలంక పోలీసులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని సీఎం డీజీపీని ఆదేశించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి స్పష్టమైన నివేదిక అందజేయాలని కోరారు. అయితే, ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. ఇప్పటికే కృష్ణలంక పీఎస్‌ సీఐను వీఆర్‌కు పంపామని సీఎం చంద్రబాబుకు డీజీపీ వివరించారు.

- Advertisement -

Also read: AP Inter supplementary: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. రేపే ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News