టాలీవుడ్ సీనియర్ కమెడియన్, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ కుమార్తె ఫాతిమా, షేక్ షెహయాజ్ ల వివాహం నవంబర్27,ఆదివారం హైదరాబాద్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా జరిగింది. నేడు గుంటూరులో వీరి పెళ్లి రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు అలీ దంపతులు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- Advertisement -
నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు అందించారు. ఈ రిసెప్షన్ కార్యక్రమం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఈ వివాహ విందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. కాగా.. హైదరాబాద్ లో జరిగిన వివాహ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి రోజా హాజరైన విషయం తెలిసిందే.