Monday, January 20, 2025
Homeఆంధ్రప్రదేశ్Davos: దావోస్‌ పర్యనటలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

Davos: దావోస్‌ పర్యనటలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

దావోస్‌(Davos)లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు(Chandrababu), రేవంత్‌రెడ్డి (Revanth Reddy)స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ ఎయిర్‌పోర్టులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసి దిగిన ఫోటో వైరల్‌గా మారింది. దీంతో రెండు రాష్ట్రాలకు వీలైనన్ని పెట్టుబడులు తీసుకురావాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

మరోవైపు జ్యురిచ్‌ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్‌పోర్టులో యూరప్‌ టీడీపీ ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌, అధికారులు ఉన్నారు. కాసేపట్లో జ్యురిచ్‌లో పెట్టుబడిదారులతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News