Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Collector: మెనూ ప్రకారం భోజనం చేయకుంటే చర్యలు తప్పవు

Collector: మెనూ ప్రకారం భోజనం చేయకుంటే చర్యలు తప్పవు

అంగన్వాడీ కేంద్రాలలో మెనూ ప్రకారం భోజనం చేయకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ అంశాల పై ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించామని, ఆ అంగన్వాడి కేంద్రంలో మెనూ ప్రకారం భోజనం చేయలేదని, చేసిన భోజనం కూడా ఉడికి ఉడకక నాణ్యతతో లేదని, ఆ కేంద్రం పరిశుభ్రంగా లేదని, పరిశుభ్రత లేని నేల మీద పిల్లలను కూర్చోబెట్టి ఉడికి ఉడకని భోజనాలు పెడుతున్నారని అది కూడా ఒకటే ప్లేట్లో ఇద్దరు చిన్నారులు తింటున్నారని.. ఆ విధంగా తినడం వల్ల చిన్నారుల ఆరోగ్యం పాడవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులకు చిన్ననాటి నుంచే విద్యను అందించాలనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలను అందిస్తుంటే ఆ అంగన్వాడి కేంద్రంలో మాత్రం వచ్చిన పుస్తకాలను ట్రంక్ పెట్టెలో పెట్టారని, ఇప్పటి నుండి అలా కాకుండా అంగన్వాడి కేంద్రాల్లో మార్పు రావాలని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేలా, మెనూ ప్రకారమే చిన్నారులకు నాణ్యతతో కూడిన భోజనం అందజేసేలా, భోజనాలు వండిన సామాన్లను, ప్లేట్లను శుభ్రంగా ఉంచుకునేలా అంగన్వాడీ టీచర్లకు ఆదేశాలు జారీచేయాలని ఐసిడిఎస్ పిడి ఉమామహేశ్వరిని ఆదేశించారు. సిడిపిఓ లు, సూపర్వైజర్లు నిరంతరం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. అదే విధంగా అంగన్వాడి కేంద్రాల్లో ఉండే చిన్నారులను, అక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీల పట్ల అంగన్వాడి టీచర్లు మర్యాదగా ప్రవర్తించేలా చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు. ముఖ్యంగా అంగన్వాడి కేంద్రాల్లో ఎక్కడైనా లైట్లు, ఫ్యాన్లు, టేబుల్స్, చైర్స్, ప్లేట్స్ వంటి సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని అందుకు సంబంధించిన నివేదికలు సోమవారం నాటికి అందచేసేలా చూడాలని ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు. అదే విధంగా బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినట్లయితే తన దృష్టికి తీసుకొని రావాలని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉదయం ప్రేయర్ చేసే సమయంలో బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి రెండు నిమిషాల పాటు విద్యార్థులకు వివరించేలా ఏర్పాటు చేయాలని సిడిపిఓ లు కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అందుకు తగిన ఏర్పాట్లు పాఠశాలలు తెరవగానే చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇదే తరుణంలో బాల్య వివాహాలను ఏ విధంగా నిర్మూలన చేయొచ్చు అనే సలహాలను కన్సోలిడేటెడ్ రిపోర్ట్స్ రూపంలో సోమవారం నాటికి అందజేయాలని ఐసీడీఎస్ పిడి ని ఆదేశించారు. సమావేశంలో ఐసిడిఎస్ పిడి ఉమామహేశ్వరి, సిడిపిఓ లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News