కాకినాడ పోర్టులో(Kakinada Port) రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్టెల్లా షిప్‌ను పరిశీలించిన తర్వాత అధికారులు 12గంటల పాటు స్టెల్లా షిప్‌లోని 5 కంపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12శాంపిల్స్ సేకరించారని తెలిపారు. షిప్‌లో దాదాపు 4వేల టన్నుల బియ్యం ఉన్నాయని.. వాటిలో 1,320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధరించామని పేర్కొన్నారు. ఈ షిప్ ద్వారా సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించామన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు.
ముందు షిప్‌లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయనుకుంటే తనిఖీల తర్వాత 13,20 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలిందని చెప్పుకొచ్చారు. ఈ బియ్యాన్ని వెంటనే షిప్ నుంచి అన్‌లోడ్ చేయించి సీజ్ చేస్తామని స్పష్‌్టం చేశార. పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12వేల టన్నులు ఉన్నాయని.. వాటిలో పీడీఎస్ బియ్యం లేవని నిర్ధరించుకున్న తర్వాతే లోడింగ్‌కు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఒక్క గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాఏ సీజ్ చేసిన షిప్‌ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.