Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Collector: చిరుధాన్యాలతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి

Collector: చిరుధాన్యాలతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి

కలెక్టరేట్ లో మిల్లెట్ కేఫ్

చిరుధాన్యాలను రోజువారి ఆహారంలో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని రెవెన్యూ అసోసియేషన్ భవనం నందు వ్యవసాయ శాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ కేఫ్ ను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో సరైన ఆహారం దొరకక చాలా మంది అనారోగ్యానికి గురి అవ్వతున్నారని ఈ మిల్లెట్ కేఫ్ ఏర్పాటు ద్వారా చిరుధాన్యాలతో తయారైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. మిల్లెట్ కేఫ్ ను ఉదయాన్నే వాకర్స్ ఉపయుక్తంగా ఉండే విధంగా మెనూ ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకుడు వేణుబాబుకు కలెక్టర్ సూచించారు.

- Advertisement -

ఇక్కడ కేవలం విక్రయ నిమిత్తం ఏర్పాటు చేసిన వాటినే కాకుండా అప్పటికప్పుడు తాజాగా సిద్ధం చేయగలిగే మిల్లెట్ దోశ, రాగిఇడ్లి తదితర వాటిని అందించేలా కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం భోజనం కూడా చిరుధాన్యాలతో ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. మిల్లెట్ కేఫ్ కు వచ్చే కొనుగోలుదారులకు కోసం సరైన సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు సరైన షెడ్ ఏర్పాటుకు కూడా అనుమతులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, వ్యవసాయ అధికారి పి
లలితా వరలక్ష్మి, ఏపిఎంఐపి పిడి ఉమాదేవి, ఏ.డి.ఏ శాలురెడ్డి, నిర్వాహకుడు వేణుబాబు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News