Thursday, November 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Investments in AP: ఏపీకి క్యూ కడుతున్న కంపెనీలు.. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు..

Investments in AP: ఏపీకి క్యూ కడుతున్న కంపెనీలు.. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు..

Investments in AP| ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు పూర్తి అయింది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే పెట్టుబడుల వేటలో మునిగిపోయారు ప్రభుత్వ పెద్దలు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh) రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. వివిధ మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇటీవల అమెరికాలో వారం రోజుల పాటు పర్యటించి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు యత్నించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి టాప్ క్లాస్ కంపెనీల ప్రతినిధులో భేటీ అయి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

- Advertisement -

లోకేష్ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే భారత పారిశ్రామిక దిగ్గజం రియలన్స్(Reliance) ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్రంలో 500 బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు(CM Chadrababu)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడి కింద రిలయన్స్ ఏర్పాటు చేసే బయో గ్యాస్ ప్లాంట్లు రాష్ట్రంలో నిరుపయోగంగా ఉండే భూములలోనే ఏర్పాటు కానుండటం గమనార్హం. ఈ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుతో రాష్ట్రానికి పన్నుల రూపేణా కేంద్రం నుంచి భారీ ఎత్తున ప్రోత్సాహకాలు లభించనున్నట్లుగా సమాచారం. ఇక ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని 2.5 లక్షల మేర ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వీటిలో కొంతమేర ప్రతక్ష్యంగా, మరికొన్ని పరోక్షంగా దొరకనున్నాయి.

ఇదిలా ఉంటే మరో దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వాణిజ్య రాజధాని విశాఖపట్టణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) క్యాంపస్ ను ఆ కంపెనీ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇదే కాకుండా సౌర, పవన విద్యదుత్పత్తి రంగాల్లో రూ.40 వేల కోట్లమేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్.. సీఎం చంద్రబాబుతో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 20 స్టార్ హోటళ్లతో పాటుగా ఓ భారీ కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత పెట్రోలియం రూ.60వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. అలాగే ఉత్తరాంధ్రలో ఉక్కు దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిట్టల్‌ జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్స్‌ కంపెనీలు సంయుక్తంగా ఉమ్మడి విశాఖలోని అనకాపల్లి దగ్గర రూ.1.25లక్షల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి లక్షల కోట్లు రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు రావడం శుభపరిణామని.. ఈ పెట్టుబడులతో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెట్టనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News