Wednesday, April 30, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం

Chandrababu: సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం

సింహాచలం ప్రమాద ఘటనలో(Simhachalam incident) 8 మంది భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు(Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. సీఎం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, ఎంపీ భరత్‌, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News