Constable Murder: కాకినాడలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ నాగేశ్వరరావు హత్యకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఈ దారుణ ఘటనకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
మద్యంమత్తులో దాడి: కాకినాడలోని గాంధీనగర్‌లో కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. విచక్షణా రహితంగా గొంతుకోశారు. దీంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హత్యచేశారు. మద్యంమత్తులోని యువకులు ఈ దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
Also read-Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
రంగంలోకి క్లూస్ టీమ్: ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఏఎస్పీ (ASP) తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. హత్యకు పాల్పడిన వారు ఎవరు? పాత కక్షలేవైనా ఉన్నాయా? లేదా అప్పటికప్పుడు జరిగిన గొడవ వల్ల ఈ హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగర నడిబొడ్డున పోలీసు కానిస్టేబుల్‌పై దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది.

